Andhra Pradesh: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల

  • సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1,91,846 మంది విద్యార్థులు
  • 68 శాతం మంది బాలికలు.. 60 శాతం మంది బాలుర హాజరు
  • 87.52 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో ప్రకాశం జిల్లా
AP 10th class supplementary exams results out

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో కూడా బాలికలే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,91,846 మంది విద్యార్థులు హాజరుకాగా... వీరిలో 1,31,233 మంది పాస్ అయ్యారు. 1,09,413 మంది బాలురు... 82,433 మంది బాలికలు పరీక్ష రాశారు. 68 శాతం మంది బాలికలు పాస్ కాగా... 60 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. 87.52 శాతం పాస్ పర్సెంటేజ్ తో ప్రకాశం జిల్లా తొలి స్థానంలో నిలువగా.. 46.66 శాతంతో పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ... కరోనా కారణంగా తరగతులు రెండేళ్ల పాటు జరగకపోవడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందని చెప్పారు. ఈ కారణం వల్ల సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించి... రెగ్యులర్ గా పాస్ అయిన విద్యార్థులతో సమానంగా గుర్తింపును ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పదో తరగతి పరీక్షలను చూసి రాసే విధానానికి తాము చెక్ పెట్టామని అన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఒక్కసారికి మాత్రమేనని... మరోసారి నిర్వహించబోమని చెప్పారు.

More Telugu News