Umamaheswari: ముగిసిన ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. హాజరైన చంద్రబాబు, బాలయ్య, లోకేశ్!

NTR daughter Umamaheswari funerals completed
  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
  • పాడె మోసిన సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ 
  • చితికి నిప్పంటించిన భర్త శ్రీనివాస ప్రసాద్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. తొలుత ఆమె ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. మహాప్రస్థానంలో ఆమె పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు మోశారు. ఆమె చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లోకేశ్ సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Umamaheswari
Funerals
Chandrababu
Balakrishna

More Telugu News