Dr BR Ambedkar Konaseema District: కోనసీమ ఇక 'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ' జిల్లా.. తుది నోటిఫికేషన్ విడుదల!

AP Govt Issues final notification on Dr BR Ambedkar konaseema district
  • కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • ఆ తర్వాత దాని పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన వైనం
  • పేరు మార్పును నిరసిస్తూ వెల్లువెత్తిన ఆందోళనలు
  • చివరికి అదే పేరును ఖరారు చేస్తూ జీవో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం కోనసీమ జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయాక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం తొలుత కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే, ఆ తర్వాత ఈ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ మే 18న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 

తొలుత ప్రకటించిన జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ పేరును చేర్చడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా, ఇప్పుడు అదే పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఇకపై ఈ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు.
Dr BR Ambedkar Konaseema District
Andhra Pradesh
G.O

More Telugu News