విడాకుల పార్టీలో పరిచయమైన వెయిటర్ ను పెళ్లాడిన మహిళ

  • బంధుమిత్రులకు విడాకుల పార్టీ ఇచ్చిన మహిళ
  • వంటలు వడ్డించిన వెయిటర్ పై మనసు పారేసుకున్న వైనం
  • ఏడాది పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న జంట
Woman marries waiter

తన విడాకుల పార్టీలో ఉన్న వెయిటర్ ను ఒక మహిళ పెళ్లాడిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గాబ్రియెల్లా లాండోల్ఫీ అనే మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ సంతోషంలో తన బంధుమిత్రులను పిలిచి ఒక హోటల్ లో పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా పార్టీకి వచ్చిన వారికి వడ్డించేందుకు వచ్చిన జాన్ అనే వెయిటర్ ఆమెకు ఎంతో నచ్చాడు. 

ఆ మరుసటి రోజు పార్టీ ఏర్పాట్ల గురించి ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు గాబ్రియెల్లాకు జాన్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత కలుసుకోవడం ప్రారంభమయింది. ఇద్దరూ ఏడాది పాటు డేటింగ్ చేశారు. 2020 డిసెంబర్ లో ఇద్దరికీ ఒక కూతురు పుట్టిన తర్వాత పెళ్లితో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News