Lok Sabha: లోక్ స‌భ స్పీక‌ర్ కుర్చీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి... ఫొటో ఇదిగో

ysrcp mp peddireddy mithun reddy chairs lok sabha
  • రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన వైసీపీ నేత‌
  • ప్యానెల్ స్పీక‌ర్ల జాబితాలో మిథున్ రెడ్డి
  • స్పీక‌ర్ చైర్‌లో కూర్చున్న త‌న ఫొటోను పంచుకున్న వైనం
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన యువ నేత‌, రాజంపేట లోక్ స‌భ స‌భ్యుడు పెద్దిరెడ్డి వెంక‌ట మిథున్ రెడ్డి మంగ‌ళ‌వారం లోక్ స‌భ‌లో స్పీక‌ర్ కుర్చీలో క‌నిపించారు. లోక్ స‌భ్ స్పీక‌ర్ గానీ, డిప్యూటీ స్పీక‌ర్ గానీ మాత్ర‌మే ఈ కుర్చీలో క‌నిపించే అవ‌కాశం ఉండ‌గా... వారిద్దరూ అందుబాటులో లేని సమయంలో ప్యానెల్ స్పీక‌ర్ జాబితాలోని ఆయా సభ్యులు కుర్చీలో కూర్చుని సభను నడిపిస్తారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల‌పై స‌మ‌గ్ర అవగాహ‌న క‌లిగేలా ఆయా పార్టీల స‌భ్యుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఆయా పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎంపీల‌ను లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్ ప్యానెల్ స్పీక‌ర్లుగా ఎంపిక చేసింది. ఈ జాబితాలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నాటి స‌మావేశాల్లో భాగంగా స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీకర్‌లు అలా ప‌క్క‌కెళ్లిపోగా... స‌భ‌ను న‌డిపించే అవ‌కాశం మిథున్ రెడ్డికి ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా లోక్ స‌భ‌ స్పీకర్ చైర్ లో తాను కూర్చుని ఉన్న ఫొటోను మిథున్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. లోక్ స‌భ‌ను కాసేపు న‌డిపించే అవ‌కాశం త‌నకు ద‌క్క‌డం గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
Lok Sabha
Peddireddi MIthun Reddy
Panel Speaker
Rajampet MP
YSRCP
Parliament

More Telugu News