'బింబిసార' చిత్రంపై ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధూ స్పందన

  • కల్యాణ్ రామ్ హీరోగా బింబిసార
  • వశిష్ఠ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం
  • ఆగస్టు 5న విడుదల
  • సినిమా చూశానన్న ఉమైర్ సంధూ
Film critic Umair Sandhu reviews on Tollywood movie Bimbisara

విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడు, ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధూ టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బింబిసార'పై స్పందించారు. నందమూరి కల్యాణ్ రామ్, కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఉమైర్ సంధూ 'బింబిసార' విడుదలకు ముందే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడిగా  'బింబిసార' చిత్రాన్ని చూశానని, చాలా బాగుందని ప్రశంసించారు. తెలుగు సినిమా మళ్లీ పుంజుకుంటోందని తెలిపారు. అటు, 'సీతారామం' చిత్రం కూడా బాగుందని ఆయన వెల్లడించారు. 

బింబిసార, సీతారామం చిత్రాలు ఒకేరోజున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ ఎంటయినర్ 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు. కల్యాణ్ రామ్ సోదరుడు, టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా విచ్చేసి నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపారు. తన సోదరుడు నటించిన 'బింబిసార'తో పాటు విడుదలవుతున్న 'సీతారామం' చిత్రాన్ని కూడా ఆదరించాలని ఆయన పెద్దమనసుతో అభిమానులకు సూచించారు.

More Telugu News