Hanuman: ఆంజనేయస్వామి పుట్టింది ఇక్కడే: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

  • హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతున్న వివాదం
  • తిరుమల కొండల్లోని అంజనాద్రి హనుమాన్ జన్మస్థలం అంటున్న టీటీడీ
  • కర్ణాటకలోని కిష్కింధ ప్రాంతంలో హనుమాన్ పుట్టాడన్న బొమ్మై
Hanuman birth place is kishkinda says Basavaraj Bommai

హనుమంతుడి జన్మస్థానంపై ఇప్పటికే పెద్ద వివాదం కొనసాగుతోంది. తిరుమల కొండల్లోని అంజనాద్రి హనుమంతుడు పుట్టిన స్థలమని టీటీడీ చెపుతోంది. తమ రాష్ట్రంలోని కిష్కింధ (ప్రస్తుత హంపి ప్రాంతం) ఆంజనేయుడి జన్మస్థలమని కర్ణాటక వాదిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న అంజనేరిలో హనుమంతుడు జన్మించాడని మరికొందరు అంటున్నారు.

ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. హనుమంతుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని... కానీ కొప్పాల్ జిల్లా కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండల్లోనే ఆంజనేయస్వామి పుట్టారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు.

More Telugu News