OnePlus: మెరుగైన బ్యాటరీ లైఫ్ తో వన్ ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ

OnePlus Nord Buds CE with 20 hours battery life launched in India
  • బడ్జెట్ కస్టమర్ల లక్ష్యంగా విడుదలైన ఇయర్ బడ్స్
  • ధర రూ.2,299.. 
  • ఫ్లిప్ కార్ట్, వన్ ప్లస్ పోర్టల్ లో లభ్యం  
ప్రముఖ ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్.. నార్డ్ బడ్స్ సీఈ పేరుతో టీడబ్ల్యూఎస్ ఇయిర్ బడ్స్ ను విడుదల చేసింది. బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నార్డ్ బడ్స్ సీఈ తీసుకొచ్చింది. దీని ధర రూ.2,299. 

ఇందులోని స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే.. 13.4 ఎఎం ఆడియో డ్రైవర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ క్యాన్సిలేషన్, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 20 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మూన్ లైట్ వైట్, మిస్టీ గ్రే రంగుల్లో లభిస్తాయి. 

వన్ ప్లస్ ఇండియా ఈ స్టోర్, ఫ్లిప్ కార్ట్ లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో అయితే ఫ్లిప్ కార్ట్, యాక్సిస్ కార్డుతో చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ అచ్చం యాపిల్ ఎయిర్ పాడ్స్ మాదిరే కనిపిస్తాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లకు ఈ ఇయర్ బడ్స్ తో అనుసంధానించుకోవచ్చు.
OnePlus
Nord Buds CE
ear buds
budget price

More Telugu News