Salman Khan: బుల్లెట్ ప్రూఫ్ కారుకు మారిపోయిన సల్మాన్ ఖాన్

Salman Khan spotted in bulletproof Toyota Land Cruiser SUV
  • ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చిన బాలీవుడ్ నటుడు
  • 1.5 కోట్ల టయోటా ల్యాండ్ క్రూయిజర్ వినియోగం
  • ఇటీవలే తుపాకీ లైసెన్స్ తీసుకున్న సల్మాన్
ప్రాణాలకు రిస్క్ ను ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరింత రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుకు మారిపోయాడు. 1.5 కోట్ల విలువ చేసే టయోటా లాండ్ క్రూయిజర్ ను ఆయన సమకూర్చుకున్నాడు. మూసేవాలాకు పట్టిన గతే నీకు కూడా పడుతుందంటూ ఇటీవలే ఓ హెచ్చరిక లేఖ సల్మాన్ ఖాన్ కు రావడం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తుపాకీ లైసెన్స్ కూడా తీసుకున్నాడు. దీంతోపాటు ఆయన కారు కూడా మార్చినట్టు తెలిసింది. సోమవారం ముంబై ఎయిర్ పోర్ట్ కు ఆయన టయోటా ల్యాండ్ క్రూయిజర్ లోనే వచ్చాడు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణ పరంగా ఈ కారుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకునే ఆయన దీన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.  (వీడియో కోసం)
Salman Khan
bulletproof
Toyota Land Cruiser
mumbai airport

More Telugu News