Ram: దోపిడీ నేపథ్యంలో రామ్ మూవీ!

Ram and Boyapati movie update
  • బోయపాటి దర్శకత్వంలో రామ్ 
  • భారీ దోపిడీ చుట్టూ తిరిగే కథ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ 
  • రామ్ కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా మూవీ 

రామ్ నుంచి ఇటీవల 'ది వారియర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అలాంటి రామ్ ఆ తరువాత సినిమాలో దోపిడీ దొంగగా కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. దోపిడీ దొంగగా ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 

రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే విషయం చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది. ఈ కథ ఒక భారీ దోపిడీ నేపథ్యంలో నడుస్తుందనేది తాజా సమాచారం. దాంతో ఇద్దరు రామ్ లలో ఒకరు దొంగగా కనిపించనున్నారని అంటున్నారు. 

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. 'అఖండ' తరువాత బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ కెరియర్ లో ఇది ఫస్టు పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

  • Loading...

More Telugu News