Jeevan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం?

Murder attempt on Jeevan Reddy
  • జూబ్లీహిల్స్ లోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఘటన
  • వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే సిబ్బంది
  • నిందితుడి నుంచి పిస్టల్, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఉదయం ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి జీవన్ రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పిస్టల్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారనే కోపంతో ఎమ్మెల్యేపై ఆయన కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది.
Jeevan Reddy
TRS

More Telugu News