Pakistan: వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. ముక్కు, చెవులు, పెదవులు కోసేసిన భర్త!

Pak Man Chops Off Cops Ears Lips For Having Affair With His Wife
  • పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘటన
  • భర్త లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు 
  • విషమంగా కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి
తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదవులు కోసేశాడో భర్త. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఝుండ్ జిల్లాకు చెందిన మహ్మద్ ఇఫ్తికార్ తన భార్యతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. 

అతడి భార్యపై కన్నేసిన కానిస్టేబుల్ ఖాసిమ్ హయత్ ఇఫ్తికార్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాక, తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో, తానే అతడికి బుద్ధి చెప్పాలని ఇఫ్తికార్ నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్‌ను అడ్డుకున్న బాధిత మహిళ భర్త నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశాడు. ఆపై కత్తితో ముక్కు, చెవులు, పెదవులు ఇతర అవయవాలను కోసేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఖాసిమ్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pakistan
Punjab Province
Jhang
Chopped Off

More Telugu News