Andhra Pradesh: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కానికి రాష్ట్రప‌తి ఆమోదం

  • ఇటీవ‌లే ఏడుగురు న్యాయ‌మూర్తుల‌ను హైకోర్టుకు సిఫార‌సు చేసిన కొలీజియం
  • కొలీజియం సిఫార‌సుల‌కు ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌
president of india approves supreme court collegium proposals of 7 ne judges to ap high court

ఏపీ హైకోర్టుకు కొత్త‌గా ఏడుగురు న్యాయ‌మూర్తుల‌ను సిఫార‌సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణ‌యానికి సోమ‌వారం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేంద్రం ఉత్త‌ర్వుల‌తో త్వ‌ర‌లోనే కొత్త న్యాయ‌మూర్తులు ఏపీ హైకోర్టులో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 

కింది కోర్టుల్లో న్యాయ‌మూర్తులుగా ప‌నిచేస్తున్న ఏడుగురిని హైకోర్టు న్యాయ‌మూర్తులుగా సిఫార‌సు చేస్తూ ఇటీవ‌లే సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం రాష్ట్రప‌తికి లేఖ పంపిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో అడుసుమిల్లి వెంక‌ట ర‌వీంద్ర‌బాబు, వ‌క్క‌ల‌గ‌డ్డ రాధాకృష్ణ కృపాసాగ‌ర్‌, బండారు శ్యామ్ సుంద‌ర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, బొప్ప‌న వ‌రాహ ల‌క్ష్మిన‌ర‌సింహ చ‌క్ర‌వ‌ర్తి, త‌ల్లాప్ర‌గ‌డ మ‌ల్లికార్జునరావు, దుప్ప‌ల వెంక‌ట‌ర‌మ‌ణ ఉన్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News