NTR: ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం

tdp founder ntr fouth daughter uma maheswari is no more
  • ఇటీవ‌లే చిన్న కుమార్తె పెళ్లి చేసిన ఉమామ‌హేశ్వ‌రి
  • సోమ‌వారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో హ‌ఠాన్మ‌ర‌ణం 
  • ఉమామ‌హేశ్వ‌రి ఇంటికి చేరిన చంద్ర‌బాబు, లోకేశ్
  • విదేశాల్లో ఉన్న నంద‌మూరి కుటుంబ సభ్యులకు  స‌మాచారం చేర‌వేత‌
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కుటుంబంలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామ‌హేశ్వ‌రి సోమ‌వారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇటీవ‌లే త‌న చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామ‌హేశ్వ‌రి ఘ‌నంగా జ‌రిపించారు. ఈ వివాహం ముగిసిన రోజుల వ్య‌వధిలోనే ఆమె మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం.

ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ హుటాహుటీన ఉమామ‌హేశ్వ‌రి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ వార్త‌ను బంధువ‌ర్గానికి చేర‌వేస్తున్న ఆమె కుటుంబ స‌భ్యులు విదేశీ టూర్‌లో ఉన్న నంద‌మూరి కుటుంబ సభ్యుల‌కూ తెలియ‌జేశారు. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న నంద‌మూరి కుటుంబ స‌భ్యులంతా ఉమామ‌హేశ్వ‌రి ఇంటికి చేరుకున్నారు.
NTR
Nandamuri
TDP
Chandrababu
Nara Lokesh
Uma Maheswari

More Telugu News