Thalapathy Vijay: షూటింగ్ కోసం వైజాగ్ చేరుకున్న తమిళ హీరో విజయ్

Thalapathy Vijay came to Visakhapatnam for new schedule of Varisu
  • వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 'వారిసు' సినిమా షూటింగ్
  • చెన్నై నుంచి విమానంలో వచ్చిన నటుడు
  • ఫొటోలు, వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన అభిమానులు
తమిళ నటుడు తలపతి విజయ్ వైజాగ్ చేరుకున్నాడు. వారిసు సినిమా తదుపరి దశ చిత్రీకరణ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఆదివారం రాత్రి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విజయ్ దర్శనమిచ్చాడు. ఫ్లయిట్ లో అక్కడి నుంచి వైజాగ్ చేరుకున్నట్టు తెలిసింది. 

విజయ్ ను విమానాశ్రయంలో చూసిన అభిమానులు ఫొటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. బ్లూ కలర్ షర్ట్ లో, నల్లటి మాస్క్ తో కనిపించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీస్తున్న వారిసు సినిమా భావోద్వేగాల కుటుంబ కథాంశంగా ఉండనుంది. ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని నెలలుగా సాగుతోంది. చెన్నై విమానాశ్రయంలో విజయ్ చాలా సాదా సీదాగా కనిపించాడు. వారిసు సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు.
Thalapathy Vijay
Visakhapatnam
Varisu
shooting

More Telugu News