Basara IIIT: మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా... పరిస్థితి ఉద్రిక్తం

Basara IIIT Students Parents protests at Sabitha Indrareddy house
  • రగులుతున్న బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారం
  • అపరిష్కృతంగానే విద్యార్థుల సమస్యలు
  • ర్యాలీ చేపట్టిన తల్లిదండ్రుల కమిటీ
  • బలవంతంగా తరలించిన పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వ్యవహారం ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాదులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసేందుకు ఆమె నివాసం వద్దకు ర్యాలీగా వచ్చారు. అనంతరం ధర్నాకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను అక్కడ్నించి తరలించే ప్రయత్నం చేశారు. వారిని బలవంతంగా వాహనం ఎక్కించారు.
Basara IIIT
Parents Committee
Protests
Sabitha Indra Reddy
Police

More Telugu News