TDP: కాపులను అణగదొక్కుతూ ‘కాపు నేస్తం’ అంటారా?: కళా వెంకట్రావు

  • ఏపీలో కాపులకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు
  • ఆ కక్షతోనే సినిమా రంగాన్ని నాశనం చేశారని ఆరోపణ
  • రాజ్యసభకు పంపేవారిలో ఒక్క కాపు కూడా లేరేమని ప్రశ్నించిన కళా వెంకట్రావు
Kala venkatarao fires on ysrcp govt

ఆంధ్రప్రదేశ్ లో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు కాపులను అణగదొక్కుతూనే.. మరోవైపు కాపు నేస్తం అంటూ ప్రచారం చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. తాంబూలమిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా కొందరికి పదవులు ఇచ్చి.. మిగతావారిని నిర్లక్ష్యం చేస్తున్నారని.. కాపులకు న్యాయం చేస్తున్నామని చెప్పే అర్హత సీఎం జగన్ కు లేదని వ్యాఖ్యానించారు. 

ఒక్కరికీ అవకాశమివ్వలేదేం?
ఆంధ్రప్రదేశ్ లో కాపులపై కక్షతోనే సినిమా రంగాన్ని సర్వ నాశనం చేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ తరఫున రాజ్యసభకు పంపినవాళ్లలో కాపు వర్గానికి చెందిన ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదేమని నిలదీశారు. అదే తమ టీడీపీ హయాంలో ఐదుగురు కాపులకు రాజ్యసభ అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఏపీలో కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News