Narendra Modi: 'మన్ కీ బాత్' లో పెద్దాపురం మరిడమ్మ ఆలయం గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

Modi mentions Peddapuram Maridamma Temple in his Mann Ki Baat program
  • నేడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం
  • రేడియోలో మోదీ ప్రసంగం
  • తన మనోభావాలను జాతితో పంచుకున్న వైనం
  • జాతరల గురించి మాట్లాడిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా తన మనోభావాలను మరోమారు దేశప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ ఆలయం గురించి ప్రస్తావించారు. 

మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో గిరిజన సమాజానికి చెందిన అనేకరకాలైన సంప్రదాయక జాతరలు జరుగుతాయని వెల్లడించారు. ఇందులో కొన్ని జాతరలు గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్నాయని తెలిపారు. మరికొన్ని జాతరలు గిరిజనుల చరిత్ర, వారసత్వంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజానికి చెందిన ఆచారాలతో ముడిపడిన పెద్ద జాతర అని మోదీ వెల్లడించారు. ఈ జాతర జ్యేష్ఠ అమావాస్య నుంచి ఆషాఢ అమావాస్య వరకు జరుగుతుందని వివరించారు. ఇక్కడి గిరిజన సమాజం ఈ జాతరను శక్తి ఉపాసనతో ముడిపెడతారని తెలిపారు. 

మేడారం సమ్మక్క-సారక్క జాతర కూడా ఇలాంటిదేనని అన్నారు. జాతరలకు ఎంతో సాంస్కృతిక మహత్మ్యం ఉందని, జాతరలు ప్రజల మనసులను కలుపుతాయని వ్యాఖ్యానించారు.
Narendra Modi
Maridamma Temple
Peddapuram
Mann Ki Baat
Prime Minister
East Godavari District
Andhra Pradesh
India

More Telugu News