Kajol: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రయాణం.. హిట్ చిత్రాలను గుర్తు చేసుకున్న నటి

Kajol revisits her films as she celebrates 30 years in cinema
  • ప్రత్యేకంగా ఓ వీడియో చేసి ఇన్ స్టా గ్రామ్ లోపోస్ట్
  • అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన నటి
  • మరెన్నో చిత్రాల్లో నటించి, కొత్త మైలు రాళ్లు చేరుకోవాలన్న అజయ్ దేవగణ్ 
ప్రముఖ సీనియర్ నటి కాజోల్ బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. 1992లో వచ్చిన బెఖూడి కాజోల్ కు తొలి సినిమా. ఆదివారంతో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాజోల్ తన పట్ల ప్రేమ, ఆదరణ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది. 

కాజోల్ 30 ఏళ్ల జర్నీ పట్ల భర్త ఆమె అజయ్ దేవగణ్ సైతం స్పందించాడు. 2020లో ఇద్దరూ కలసి నటించిన తన్హాజి సినిమా కోసం డ్యాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘సినిమాతో మూడు దశాబ్దాలు. నిజంగా నీవు ఇప్పుడే జర్నీ మొదలు పెట్టావు. నీ జీవితంలో మరెన్నో మైలు రాళ్లు, చిత్రాలు, జ్ఞాపకాలు’’అంటూ అజయ్ దేవగణ్ తన స్పందన తెలియజేశాడు.

30 ఏళ్లలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కాజోల్ వాటిని గుర్తు చేస్తూ ప్రత్యేక వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. బేఖుడి, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, గుప్త్, ప్యార్ కియా తో డర్నా క్యా, ప్యార్ తో హోనా హై తా, కుచ్ కుచ్ హోతా హై, కభీ కుషి కభీ గమ్, ఫనా, మై నేమ్ ఈజ్ ఖాన్, హెలికాప్టర్ ఈల, తన్హాజీ, త్రిభంగ చిత్రాలను ఆమె గుర్తు చేసింది. (వీడియో కోసం)

‘‘ఎవరో ఒకరు ‘నీవు ఎలా ఫీలవుతున్నావు’అని నన్ను నిన్న అడిగారు. దీన్ని మాటల్లో చెప్పలేను. నా పట్ల చూపించిన అపార అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలను’’అన్న క్యాప్షన్ ను కాజోల్ పెట్టింది. పరిశ్రమలో మరో 30 ఏళ్లు పనిచేయగలనన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేసింది.
Kajol
Bollywood
actor
30 years
ajay devgan

More Telugu News