రణవీర్ సింగ్ మహిళా లోకానికి మేలు చేశాడు: రాఖీ సావంత్

  • కెమెరా ముందు ఎంతో మంది అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారన్న రాఖీ
  • రణవీర్ కూడా అలా కనిపించి ఈ దేశ అమ్మాయిలకు సాయం చేశాడని కితాబు
  • ఇక ముందూ ఇలానే చేస్తే చూడాలని ఉందంటూ కామెంట్
Rakhi Sawant says Ranveer Singh has done a favour to Indian women by posing nude

రాఖీ సావంత్ సంచలనాలకు మారు పేరు. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసే ఈ నటి.. రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ (శరీరంపై వస్త్రాలు లేకుండా ఫొటోలు దిగడం)ను బలంగా సమర్థించింది. అంతేకాదు, భవిష్యత్తులో రణవీర్ సింగ్ ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయాలని ఆమె కోరుకుంటోంది. రణవీర్ ఇటీవల నగ్నంగా కనిపించి.. భారతీయ మహిళలకు మేలు చేశాడని ఆమె తాజాగా వ్యాఖ్యానించింది. ఓ మేగజైన్ కవర్ పేజీ కోసం దిగంబరంగా ఫొటోలు ఇచ్చిన రణవీర్ సింగ్ ను సినీ పరిశ్రమ వర్గాలు సమర్థిస్తుంటే.. ఇతరులు విమర్శిస్తుండడం తెలిసిందే.

పలు ప్రాంతాల్లో రణవీర్ కు వ్యతిరేకంగా కేసులు కూడా నమోదయ్యాయి. రణవీర్ సింగ్ గురించి మాట్లాడుతూ రాఖీ సావంత్ ఓ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ‘‘నేను ఇప్పుడే దుబాయి నుంచి వెనుదిరిగాను. ఇప్పటికీ రణవీర్ న్యూడ్ ఫొటోల గురించిన మాటలే ప్రతి ఒక్కరి నుంచి వినబడుతున్నాయి. కెమెరా ముందు ఎంతో మంది అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తుంటారు. కెమెరా ముందు నగ్నంగా కనిపించడం ద్వారా రణవీర్ ఈ దేశంలోని అమ్మాయిలకు మేలు చేశాడు. మా కళ్లల్లో, గుండెల్లో ప్రశాతంతను పొందాం’’అని రాఖీ సావంత్ పేర్కొంది. 

‘‘అతడు చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఎక్కడ ఉన్నావు నా ప్రియమైన మిత్రుడా? ఈ తరహా ఫొటో షూట్స్ చేస్తూ ఉండాలి. నేను నిన్ను ఇలానే చూడాలనుకుంటున్నాను’’అని రాఖీ తన మనసులోని భావాలను బయటపెట్టింది. (వీడియో కోసం)

More Telugu News