66 year old: 66 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. దీని ముందు ఇప్పటి రిఫ్రిజిరేటర్లు దిగదుడుపే

The Internet cannot keep calm over this 66 year old fridge
  • ట్విట్టర్ లోకి చేరిన ఫ్రిగిడైర్ రిఫ్రిజిరేటర్ ప్రకటన వీడియో
  • ఈ రిఫ్రిజిరేటర్ లో బయటకు పుల్ చేసుకునే కంపార్ట్ మెంట్లు
  • ఫ్రిజ్ డోర్ భాగంలోనూ క్లోజ్డ్ కంపార్ట్ మెంట్లు
టెక్నాలజీ కాలంతో పాటు మరింత కొత్త దనాన్ని సంతరించుకుంటోంది. ఇది నిజమేనని అందరూ చెబుతారు. కానీ, 66 ఏళ్ల క్రితం నాటి ఓ రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) వీడియోను ఒక్కసారి చూస్తే.. ఇప్పటి కొత్త తరహా రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే అదే వెయ్యి రెట్లు నయం.. అలాంటిదే కావాలని తప్పకుండా అంటారు. అంత సౌకర్యవంతమైన డిజైన్ తో పాత కాలంలోనే రిఫ్రిజిరేటర్ ను రూపొందించడాన్ని నిజంగా అభిమానించకుండా ఉండలేరు.

కాలం గడుస్తున్న కొద్దీ డిజైన్ లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. మరింత సౌకర్యాలు తోడవుతాయి. కానీ, ఇక్కడి 1956 నాటి ‘ఫ్రిగిడైర్’ ఫ్రిడ్జ్ ను చూస్తే ఇదే ఆధునికంగా అనిపిస్తుంది. నాడు ఫ్రిగిడైర్ రిఫ్రిజిరేటర్ ప్రకటన వీడియోను ‘లాస్ట్ ఇన్ హిస్టరీ’ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇది ఎంతో మందిని ఆకర్షిస్తోంది. తమకు కూడా ఇలాంటి రిఫ్రిజిరేటర్ కావాలని యూజర్లు కామెంట్లు పెడుతుండడం గమనార్హం. 

‘‘ఈ 66 ఏళ్ల క్రితం నాటి ఫ్రిడ్జ్ ఇప్పుడు నాకున్న దానికంటే ఎందుకు గొప్పది?’’ అని లాస్ట్ ఇన్ హిస్టరీ పేజీ నిర్వాహకుడు పోస్ట్ పెట్టడం గమనార్హం. ఈ ఫ్రిడ్జ్ లో కంపార్ట్ మెంట్లు ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. బయటకు పుల్ చేసి కావాల్సింది తీసుకోవచ్చు. డోర్ కు లోపలి వైపు పండ్లను తాజాగా ఉంచే కంపార్ట్ మెంట్ అదనపు ఆకర్షణ. అడుగు భాగాన డీప్ ఫ్రీజర్ ఏర్పాటు చేశారు. పూర్వకాలంలోనే నిండుగా కొత్తదనం అద్దుకున్న ఉత్పత్తి ఇది.
66 year old
fridge
attractive
features
old
refregirator

More Telugu News