ఎక్స్ పోజింగ్ లో పోటీపడుతున్న కపూర్ సిస్టర్స్

  • గుడ్ లక్ జెర్రీ సినిమాకు సంబంధించి ముంబైలో ప్రైవేటు స్క్రీనింగ్
  • తండ్రి బోనీ కపూర్ తో కలిసి హాజరైన జాన్వీ, ఖుషీ
  • ముగ్గురూ తెల్లటి వస్త్రధారణతో కనిపించిన దృశ్యం
Janhvi Kapoor attends Good Luck Jerry screening with Khushi Kapoor and Boney Kapoor

శ్రీదేవి, బోనీ కపూర్ ముద్దుల తనయ జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి ముంబైలో శనివారం ఓ ప్రైవేటు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జాన్వీ కపూర్, తన సోదరి కుషీ కపూర్, తండ్రి బోనీ కపూర్ తో కలసి హాజరైంది. 

ఈ సందర్భంగా తండ్రి, తనయలు మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ముఖ్యంగా జాన్వీ, కుషీ ఇద్దరూ ఎక్స్ పోజింగ్ లో పోటీ పడ్డారు. జాన్వీ అయితే పై నుంచి కింది వరకు ఒకే లాంగ్ స్కర్ట్ తో (తెల్లటి) దర్శనమిచ్చింది. బోనీ కపూర్ సైతం తెల్లటి డ్రెస్ లోనే వచ్చారు. కుషీ కూడా అదే రంగు ప్యాంట్ పై, లూజ్ గా ఉన్న బ్లౌజ్ వేసుకుని కాస్త వెరైటీ లుక్ తో కనిపించింది. ఖుషీ కపూర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే 'ది ఆర్చీస్' సినిమాతో త్వరలో నటనా ప్రవేశం చేయనుండడం తెలిసిందే.

More Telugu News