మంత్రి మేరుగు నాగార్జునకు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలు

  • విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్తుండగా ప్రమాదం
  • చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  
  • ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు  చేస్తున్న పోలీసులు
Road accident to AP minister Merugu Nagarjuna

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపుకు వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. 

More Telugu News