Sanket Sargar: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ... వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ కు రజతం

Sanket Sargar wins Weight Lifting Silver in Commonwealth Games
  • బ్రిటన్ లో కామన్వెల్త్ క్రీడలు
  • భారత్ పతకాల వేట షురూ
  • 248 కేజీల బరువెత్తిన సంకేత్
  • మలేసియా లిఫ్టర్ స్వర్ణం
బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభమయింది. వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ రజతం సాధించాడు. సంకేత్ ఇవాళ జరిగిన 55 కేజీల కేటగిరీలో రెండో స్థానంలో నిలిచాడు. సంకేత్ స్నాచ్ అండ్ జెర్క్ లో మొత్తం 248 కిలోల (113, 135) బరువెత్తి రజతం అందుకున్నాడు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే స్నాచ్ అండ్ జెర్క్ రెండో పర్యాయంలో సంకేత్ గాయపడ్డాడు. దాంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు.

ఈ పోటీలో మలేసియాకు చెందిన బిబ్ అనిక్ మొత్తం 249 కేజీలతో స్వర్ణం సాధించాడు. తన ప్రదర్శనతో బిబ్ అనిక్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. ఇందులో శ్రీలంకకు చెందిన దిలంక యోదగె 225 కేజీలతో కాంస్యం దక్కించుకున్నాడు. కాగా, తన పతకాన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్టు సంకేత్ సర్గర్ వెల్లడించాడు. 
Sanket Sargar
Silver
Weight Lifting
Commonwealth Games
India
Birmingham
Britain

More Telugu News