Binbisara: 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ లో విషాదం.. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి!

Junior NTR fan dead in Binbisara movies pre release event
  • నిన్న శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్
  • అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాయిరాం అనే అభిమాని
  • మృతుడిది ఏపీలోని తాడేపల్లిగూడెం అని గుర్తింపు
నందమూరి కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం 'బింబిసార'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మరోవైపు ఈ ఈవెంట్ కు నందమూరి అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడిది ఏపీలోని తాడేపల్లిగూడెం అని గుర్తించారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఓ ప్రైవేట్ సంస్థలో అతను పని చేస్తున్నాడు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిమానుల తోపులాటలో సాయిరాం మృతి చెందాడా? లేక అభిమానుల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Binbisara
Pre Release Event
Kalyanram
Junior NTR
Fan
Dead

More Telugu News