వివాదాస్పద ఫొటో షూట్ విషయంలో.. రణవీర్ సింగ్ ను వెనుకేసుకొచ్చిన జాన్వీకపూర్

  • రణవీర్ చేసింది కళాత్మక స్వేచ్ఛగా పేర్కొన్న జాన్వీ
  • అందుకు శిక్షించకూడదంటూ కామెంట్
  • రణవీర్ కు పెరుగుతున్న మద్దతుదారులు
Janhvi Kapoor defends Ranveer Singh nude photoshoot

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన దిగంబర ఫోటో షూట్ తో విమర్శల పాలు కాగా, ఆయనకు మద్దతుగా నిలిచేవారు కూడా పెరుగుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్ధమాన కథనాయిక, నట దిగ్గజం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం రణవీర్ కు మద్దతుగా నిలిచింది. శుక్రవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో జాన్వీ కపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఆమెకు రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఓ మేగజైన్ కవర్ పేజీ కోసం రణవీర్ వంటిపై ఏమీ లేకుండా ఫొటోలు దిగడం తెలిసిందే. దీన్ని కళాత్మక స్వేచ్ఛగా జాన్వీ కపూర్ అభివర్ణించింది. ఏ ఒక్కరి కళాత్మక స్వేచ్ఛను శిక్షించరాదని ఆమె పేర్కొన్నారు. జాన్వీ అనే కాకుండా.. రణవీర్ చేసిన పనిని మరెంతో మంది బాలీవుడ్ ప్రముఖులు సమర్థించడం తెలిసిందే. రణవీర్ తో కలసి నటించిన పరిణితి చోప్రా, వాణి కపూర్, అలియా భట్, విద్యా బాలన్ సహా ఎంతో మంది వెనుకేసుకొచ్చారు. విద్యా బాలన్ అయితే.. ‘‘అసలు సమస్య ఏంటి? ఓ వ్యక్తి మొదటిసారి చేశారు కదా. దీన్ని కూడా ఆస్వాదించండి’’ అని విద్యా బాలన్ పేర్కొనడం గమనార్హం.

More Telugu News