man: కోపిష్ఠి యజమానికి ‘గాడిద’ ట్రీట్ మెంట్!

Man slaps and kicks donkey repeatedly in viral video
  • గాడిదను ఇష్టమొచ్చినట్టు కొట్టిన వ్యక్తి
  • ఆ తర్వాత దానిపై స్వారీకి ప్రయత్నం
  • కింద పడేసి గిరగిరా తిప్పేసిన గార్దభం
ఏమైందో కానీ, ఓ యజమాని తన గాడిదపై ప్రతాపం చూపించాడు. రెండు చేతులతో దాని ముఖంపై లాగి కొడుతూ, కాలితో ముఖాన్ని తన్నడం మొదలు పెట్టాడు. అయినా ఆ గాడిద మౌనంగా భరించింది. అలా, తన ఓపిక క్షీణించే వరకూ అదే విధంగా చేశాడు. చివరికి అలా కొట్టుడు కార్యక్రమం ముగిసిన తర్వాత అదే గాడిదపైకి ఎక్కి కూర్చుని స్వారీ చేయాలనుకున్నాడు. మరీ అంతగా కొట్టిన తర్వాత గాడిద మాట వింటుందా? 

ఇంక ‘నాకు టైమ్ వచ్చిందనుకున్న’ గాడిద.. యజమానికి చుక్కలు చూపించింది. అతడ్ని కిందకు పడేసి, అతడి కాలిని నోటితో కరుచుకుని గిరగిరా గుండ్రంగా నేలపై ఈడ్చేసింది. ఈ వీడియో చూస్తే దేనికైనా ఓ హద్దు ఉంటుందని అనుకోక మానరు.‘మీరు ఏది విత్తితే, అదే ఫలితం వస్తుంది’ అన్న సామెతను ఈ ఘటన రుజువు చేసింది. ఈ వీడియోను బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా, వైరల్ అవుతోంది. కర్మ ఫలితం అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. (వీడియో కోసం)
man
slaps
donkey
vedio
viral

More Telugu News