Panneerselvam: బీజేపీవైపు పన్నీర్‌సెల్వం చూపు.. త్వరలోనే కాషాయపార్టీలోకి?

Is Panneerselvam mulling BJP move hoarding rises questions
  • మోదీ, అమిత్‌షా ఫొటోలతో భారీ హోర్డింగ్ ఏర్పాటు
  • చెస్ ఒలింపియాడ్‌ ప్రారంభం కోసం మోదీ చెన్నై వచ్చిన రోజే హోర్డింగ్
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు
అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బీజేపీ వైపు చూస్తున్నారా? త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంచీపురంలో పన్నీర్‌సెల్వం వర్గం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లో ఓ వైపు మోదీ, మరోవైపు అమిత్ షా ఫొటోలు ఉండడమే ఈ ఊహాగానాలకు కారణం. 

ఈ హోర్డింగ్‌పై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చేరేందుకు సన్నాహకాల్లో భాగంగానే ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారని కొందరు చెబుతుంటే, బీజేపీని మచ్చిక చేసుకుని అన్నాడీఎంకేలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. 

చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కోసం మోదీ చెన్నైకి వచ్చిన రోజే ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. అన్నాడీఎంకేలో నెలకొన్న నాయకత్వ పోరులో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిది పై చేయి కావడం, పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా ఎదురుదెబ్బ తగలడంతోనే పన్నీర్‌సెల్వం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
Panneerselvam
Tamil Nadu
Narendra Modi
BJP
Amit Shah
AIADMK

More Telugu News