Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి

Adhir Ranjan Chowdhury apologizes president Droupadi Murmi
  • 'రాష్ట్రపత్ని' అంటూ కలకలం రేపిన అధిర్ రంజన్ చౌదరి
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ వర్గాలు
  • పార్లమెంటులోనూ రగడ
  • ఎట్టకేలకు వెనక్కి తగ్గిన కాంగ్రెస్ నేత

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించడం పార్లమెంటును కుదిపేసింది. బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు చోటుచేసుకున్నాయి. 

గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు నేరుగా టార్గెట్ చేసిన దృశ్యాలు పార్లమెంటులో కనిపించాయి. ఇలాంటి వ్యాఖ్యలకు అనుమతిస్తున్నందుకు సోనియానే బాధ్యత వహించాలని వారు ఆమెను చుట్టుముట్టిన పరిస్థితి తలెత్తింది. 

ఈ నేపథ్యంలో, వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యల పట్ల వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు తెలిపారు.

  • Loading...

More Telugu News