Shakira: ఆదాయపన్ను చిక్కుల్లో పాప్ స్టార్ షకీరా... దోషిగా తేలితే ఎనిమిదేళ్ల జైలు శిక్ష!

Pop star Shakira faces eight years jail term in Spain
  • పన్ను ఎగవేతకు పాల్పడినట్టు షకీరాపై ఆరోపణలు
  • వాదనలు వినిపించిన ప్రాసిక్యూటర్లు
  • తదుపరి విచారణలో తీర్పు వెలువడే అవకాశం
అంతర్జాతీయ పాప్ గాయని షకీరా (45) ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. ఆదాయపన్నుకు సంబంధించి షకీరా మోసాలకు పాల్పడినట్టు స్పెయిన్ లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. షకీరాకు ఎనిమిదేళ్లకు పైగా జైలుశిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. షకీరా 2012-14 మధ్యకాలంలో రూ.116 కోట్ల మేర స్పెయిన్ ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా, తదుపరి విచారణలో షకీరా కేసులో తుదితీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కొలంబియాకు చెందిన షకీరా... స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పిక్ తో సహజీవనం చేసింది. 12 ఏళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిక్ తో అఫైర్ సందర్భంగా షకీరా తన మకాంను స్పెయిన్ కు మార్చింది.
Shakira
Tax Fraud
Spain
Jial Term
Pop Star

More Telugu News