బోల్ట్ నుంచి ఆకర్షణీయ ధరకే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్

  • ఒమెగా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ పేరుతో ఆవిష్కరణ
  • గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేక ఫీచర్
  • అమెజాన్, బోల్ట్ ఆడియో పోర్టళ్లలో లభ్యం
Boult Omega earbuds launched in India price set at Rs 2499

వినోద, సంగీత ప్రియుల కోసం మార్కెట్లోకి ఎన్నో రకాల ఇయర్ బడ్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా బోల్ట్ కంపెనీ ఒమెగా టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. వీటి ధర రూ.2,499. మాట్లాడే సమయంలో అవతలి వారికి నాయిస్ వినపడకుండా అడ్డుకునే జెన్ మోడ్ ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో ఉంది. ఎన్నో రకాల మ్యూజిక్ మోడ్స్, ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లలో కొన్ని. 

అమెజాన్, బోల్ట్ ఆడియో పోర్టళ్లలో ఇయర్ బడ్స్ కొనుగోలు చేసుకోవచ్చు. గేమ్స్ ఆడే సమయంలో వచ్చే శబ్దాలను పూర్తి స్థాయిలో అనుభవించేందుకు 45ఎంఎస్ లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ను ఈ ఇయర్ బడ్స్ లో బోల్ట్ చేర్చింది. టచ్ క్రంటోల్స్, బ్లూటూత్ వెర్షన్ 5.2 సపోర్ట్ తో వస్తుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్ బుక్, విండోస్ లకు సైతం ఇది సపోర్ట్ చేస్తుంది.

More Telugu News