Indigo: టేకాఫ్ సమయంలో రన్ వేపై జారిపోయిన ఇండిగో విమానం

IndiGo Plane Skids Off Runway During TakeOff
  • జొర్హాట్ నుంచి కోల్ కతాకు వెళ్తున్న విమానం 
  • రన్ వే పక్కనున్న బురదలో ఇరుక్కుపోయిన విమాన చక్రం
  • ప్రమాదం సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు
అసోంలోని జొర్హాట్ లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్ కతాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన ఫొటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో, ఈ విమాన సర్వీసును ఇండిగో ఆపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
Indigo
Skid
Runway

More Telugu News