Woman: బేకరీలో దోపిడీకి వచ్చిన దొంగ.. కేవలం వస్త్రంతో ధైర్యంగా అడ్డగించిన మహిళ

Woman fights off robber with a cleaning cloth at her bakery in Netherlands
  • నెదర్లాండ్స్ లోని ఓ బేకరిలోకి వచ్చిన ముసుగు దొంగ
  • కౌంటర్ లోని నగదు కొట్టేసేందుకు తీవ్ర ప్రయత్నం
  • క్లీనింగ్ క్లాత్ తో అతడి ఆట కట్టించిన మహిళ
భయపడిపోతే ఏమీ చేయలేం. ధైర్యంగా ఉంటే దేన్నయినా ఎదుర్కోగల శక్తి వస్తుందని నిపుణులు చెప్పే సూచనను ఓ మహిళ అక్షరాలా ఆచరణలో చూపించింది. నెదర్లాండ్స్ లోని ఓ బేకరీలో జరిగిన ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అవగా.. వీడియో ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీన్ని చూసిన వారు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.  

లతీఫ్ పెకెర్ అనే మహిళ తన కుమారుడి బేకరీలో కౌంటర్ టేబుల్ ను క్లీన్ చేస్తోంది. బేకరీ డోర్ వద్దకు నల్లటి హుడీ షర్ట్ వేసుకుని వచ్చిన అగంతుకుడు గ్లాస్ డోర్ నుంచి బేకరీని పరిశీలించాడు. మహిళ ఒక్కతే ఉండడంతో తన పని సులువే అనుకుని, క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి దూసుకొచ్చాడు. క్యాష్ డెస్క్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. 

మొదట అతడి చేతిలో ఆయుధం ఉందనుకుని వెనకడుగు వేసిన బేకరీ మహిళ.. ధైర్యం చేసి అతడి మీదకు క్లీన్ చేసే క్లాత్ తో దూసుకుపోయింది. అతడు ఆమెను తోసేసేందుకు గట్టిగా ప్రయత్నం చేశాడు. అయినా ఆమె తగ్గలేదు. బలంగా అతడిని ఎదుర్కొంది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనింగ్ క్లాత్ కు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో స్పందించడం గమనార్హం.
Woman
fights off
robber
cleaning cloth
bakery
Netherlands

More Telugu News