Andhra Pradesh: ఇప్పుడు తిరుపతిలో జరగని పాపం అంటూ లేదు: సినీ నిర్మాత అశ్వనీదత్

  • వైసీపీ మూడేళ్ల పాలనతో తిరుపతిని సర్వనాశనం చేసిందన్న అశ్వనీదత్ 
  • అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని వ్యాఖ్య
  • చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్న అశ్వనీదత్
Producer Ashwani dutt sensational comments on ycp govt over tirupati

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహింలేమని, ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదని అశ్వనీదత్ అన్నారు. స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు.  

గతంలో తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారన్నారు.  కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చినజీయర్ ఆ మధ్య జగన్ ను దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వినగానే తన కడుపు మండిపోయిందని అశ్వనీదత్  తెలిపారు.

సమ్మక్క- సారక్కను చినజీయర్ దేవతలు కాదనడం తనకు బాధ కలిగించిందన్నారు. సమ్మక్క-సారక్క అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో సమ్మక్క- సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు. తాను నిర్మించిన ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వనీదత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News