సంక్రాంతి బరిలోకి దిగే ఆలోచనలో 'ఏజెంట్'

  • షూటింగు దశలో 'ఏజెంట్' 
  • అఖిల్  జోడీగా సాక్షి వైద్య 
  • తెలుగులో ఇదే ఆమెకి ఫస్టు సినిమా 
  • ఆగస్టులో రిలీజ్ లేనట్టే  
Agent movie update

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమాను రూపొందిస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సాక్షి వైద్య పరిచయం కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.  

కానీ అప్పటికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న పనులు పూర్తికాకపోవడం వల్లనే ఈ సినిమా 'ఆగస్టు 12కి రావడం లేదని అంటున్నారు. ఇక ఆ తరువాత 'దసరా'కి కాస్త గట్టిపోటీనే కనిపిస్తోంది. అందువలన అప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదట.  

సంక్రాంతి బరిలోకి దిగవలసిన సినిమాలు చాలావరకూ వెనక్కి వెళుతుండటంతో, 'ఏజెంట్'ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందేమోననే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పండుగ సీజన్ లో విడుదలయ్యే సినిమాలో సహజంగానే ఎక్కువ వసూళ్లను రాబడుతుంటాయి. అందువలన 'ఏజెంట్'ను సంక్రాంతి బరిలోకి దించడం ఖాయం కావొచ్చని అంటున్నారు.

More Telugu News