Ponnala Lakshmaiah: చరిత్రలో నిరుపయోగమైన ప్రాజెక్టును కట్టిన చరిత్ర కేసీఆర్ దే: పొన్నాల లక్ష్మయ్య

KCR is the only person who built useless project says Ponnala Lakshmaiah
  • అహంకారానికి అనుభవరాహిత్యం తోడైన వ్యక్తి కేసీఆర్ అన్న పొన్నాల 
  • కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రానికి ఉపయోగం ఉందని నిరూపించగలరా? అని నిలదీత 
  • ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి కమీషన్లను పండించాయని విమర్శ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. అహంకారానికి అనుభవరాహిత్యం తోడైన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రానికి ఉపయోగం ఉందని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. చరిత్రలో నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును కట్టిన చరిత్ర కేసీఆర్ దేనని అన్నారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి కమీషన్లను పండించాయని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లో 50 టీఎంసీల నీరు నింపే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులకు, టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు చాలా తేడా ఉందని అన్నారు. నీటి కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్ దని చెప్పారు.
Ponnala Lakshmaiah
Congress
KCR
TRS

More Telugu News