Tollywood: రిలీజ్‌కు ముందే సోష‌ల్ మీడియాలో ర‌వితేజ కొత్త సినిమా బిట్‌

  • రేపు విడుద‌లవుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' 
  • ఎడిటింగ్ రూం నుంచే లీకై ఉంటుంద‌ని అనుమానం
  • ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్న చిత్ర బృందం
a leaked bit of raviteja new movie RamaRaoOnDuty goes viral on social media

టాలీవుడ్‌లో మాస్ మ‌హారాజ‌గా వెలిగిపోతున్న ర‌వితేజ కొత్త సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 29న (శుక్ర‌వారం) విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల‌కు ఒక్క రోజు ముందుగా సినిమాలోని ఓ బిట్‌... సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 22 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో లీక్ కావ‌డంతో చిత్ర యూనిట్ ఆందోళ‌న‌లో ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ఆ బిట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ సీన్‌కు చెందిన‌దిగా ఆ బిట్ క‌నిపిస్తోంది. ప్ర‌తి నాయ‌కుల‌కు ర‌వితేజ గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తూ ఆ బిట్‌లో క‌నిపించారు. ఈ వీడియో బిట్ బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే లీకేజీని ప‌సిగ‌ట్టిన చిత్ర యూనిట్ ఘ‌ట‌న‌పై ఆరా మొద‌లెట్టింది. ఎడిటింగ్ రూం నుంచే ఈ బిట్ లీకై ఉంటుంద‌ని భావిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తారా?  లేదా? అన్న దానిపై స్ప‌ష్ట‌త రాలేదు.

More Telugu News