Buddha Venkanna: ఇప్పటిదాకా విజయసాయిరెడ్డికి బుర్ర అరికాల్లో ఉందనే అనుమానం ఉండేది: బుద్ధా వెంకన్న

Buddha Venkanna satires on Vijayasai Reddy
  • విజయసాయి, బుద్ధా మధ్య ట్విట్టర్ వార్
  • విశాఖను టీడీపీ పట్టించుకోలేదన్న విజయసాయి
  • బుర్రతక్కువ వాడని తేలిపోయిందంటూ వెంకన్న ఎద్దేవా

సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్న మధ్య విమర్శల యుద్ధం గురించి తెలిసిందే. తాజాగా, విజయసాయిని ఉద్దేశించి బుద్ధా ట్వీట్ చేశారు. ఇప్పటివరకు విజయసాయిరెడ్డికి బుర్ర అరికాల్లో ఉందనే అనుమానం ఉండేదని, విశాఖ ఆదాయంపై ఆయన చేసిన ట్వీట్ చూశాక బుర్ర తక్కువవాడని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 

నాడు విశాఖ అభివృద్ధిపై టీడీపీ దృష్టి పెట్టి ఉంటే జాతీయస్థాయిలో ఐదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు వైసీపీ వచ్చాక విశాఖ అభివృద్ధి పథంలో పయనిస్తోందంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా బుద్ధా పైవ్యాఖ్యలు చేశారు. 2016-17లోనే విశాఖ జీడీపీ 43.5 బిలియన్లుగా ఉందని బుద్ధా వెల్లడించారు. "ఇప్పుడున్న ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే... మీరు పెంచినట్టా, తగ్గించినట్టా అనేది నీ దొంగ సీఏ మెదడుతో ఆలోచించు" అంటూ బుద్ధా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News