Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాల రద్దు

Tirumala Brahmotsavalu
  • సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • 27న శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
  • ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు శ్రీవారికి వాహన సేవలు
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు.

ఇక అక్టోబర్ 1న గరుడవాహన సేవ ఉంటుందని, 5న చక్రస్నానం నిర్వహిస్తారని చెప్పారు. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారికి వాహన సేవలను నిర్వహిస్తామని చెప్పారు.
Tirumala
Brahmotsavalu
Jagan

More Telugu News