Appalaraju: తిరుమలలో అనుచరులతో కలిసి మంత్రి వీఐపీ దర్శనం.. భక్తుల ఆగ్రహం

Minister Appalaraju in Tirumala
  • 150 మంది అనుచరులతో తిరుమలకు వెళ్లిన మంత్రి 
  • అందరికీ ప్రొటోకాల్ దర్శనం చేయించాలని ఒత్తిడి
  • క్యూలైన్లోనే వెళ్లి దర్శనం చేసుకున్నామన్న మంత్రి  

ఏపీ మంత్రి అప్పలరాజు 150 మంది అనుచరులతో కలిసి ఈ రోజు తిరుమలకు వెళ్లారు. వీరందరికీ కూడా వీఐపీ ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. అయితే, ఈ అంశంపై అప్పలరాజు మాట్లాడుతూ, తన నియోజకవర్గానికి చెందిన 150 మందితో స్వామివారి దర్శనానికి వచ్చానని... తాను కూడా సామాన్య భక్తుడి మాదిరే క్యూలైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. ప్రొటోకాల్ దర్శనం కోసం అధికారులపై తాను ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు.  

  • Loading...

More Telugu News