TDP: మూగ జీవాల ఆక‌లి తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల‌... వీడియో ఇదిగో

nimmala rama naidu distributes fodder in flood affected areas
  • వ‌ర‌ద‌ల్లో మునిగిన లంక గ్రామాలు
  • ప‌శువుల‌కు గ్రాసంపై దృష్టి సారించిన నిమ్మ‌ల‌
  • ఇత‌ర గ్రామాల నుంచి ప‌చ్చ‌గ‌డ్డి తెప్పించి పంపిణీ చేసిన వైనం
ఇప్ప‌టికే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఓ వైపు జోరున వ‌ర్షం కురుస్తున్నా... గొడుగు ప‌ట్టుకుని మ‌రీ బాధితుల‌కు అండ‌గా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు... తాజాగా వ‌ర‌ద ప్రాంతాల్లో మూగ జీవాల ప‌రిస్థితిపై దృష్టి సారించారు. ఆయా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగితే ప‌శువుల‌కు ఆహారం ఎలా? అన్న ఆలోచ‌న‌తో ఆయ‌న వ‌ర‌ద‌లో మునిగిన గ్రామాల్లోని ప‌శువుల‌కు ప‌శుగ్రాసం అంద‌జేశారు. 

త‌న పిలుపు మేర‌కు ఉండి మండలం కలిగొట్ల గ్రామం నుండి రెండు ట్రక్కులతో 200 పచ్చగడ్డి మోపులను అక్క‌డి రైతులు తీసుకొచ్చారు. ఈ గ‌డ్డి మోపుల‌ను చూసిన పాడి రైతుల క‌ళ్ల‌ల్లో చాలా ఆనందం క‌నిపించిందంటూ నిమ్మ‌ల తెలిపారు. ప‌శుగ్రాసం పంపిణీకి సంబంధించిన వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.
TDP
Nimmala Rama Naidu
Palakollu
Floods
West Godavari District
Fodder

More Telugu News