Allu Arjun: మళ్లీ జట్టుకట్టిన హరీశ్​ శంకర్, అల్లు అర్జున్.. !

Director Harish shooting for an ad with Icon Staar alluarjun
  • బన్నీ యాడ్ ఫిల్మ్ కు హరీశ్ దర్శకత్వం
  • థాయ్ లాండ్ లో చిత్రీకరణ
  • త్వరలోనే విడుదల కానున్న యాడ్  
దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది.  

సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా బన్నీ దూసుకెళ్తున్నాడు. ప్రముఖ బ్రాండ్లకు తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇదివరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 
Allu Arjun
harish shankar
tollywood
add
direction

More Telugu News