mobile data: ఐదు దేశాల్లో మొబైల్ డేటా చౌక.. భారత్ లోనూ

  • ఇజ్రాయెల్ లో అతి తక్కువ చార్జీ
  • ఒక జీబీకి రూ.3.20
  • భారత్ కు ఐదో ర్యాంకు
  • సెయింట్ హెలెనాలో అత్యధిక రేటు
5 countries that offer cheapest mobile data India in the list

మొబైల్ టారిఫ్ లు నెలకు రూ.250కు చేరాయి. డేటా కావాలంటే కనీసం ఈ మాత్రం అయినా రీచార్జ్ చేసుకోవాల్సిందే. దీంతో టెలికం కంపెనీలు బాదేస్తున్నాయంటూ సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఆరోపిస్తుంటారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ డేటా టారిఫ్ లను పరిశీలించినట్టయితే, భారత్ లో చార్జీలు చాలా తక్కువే అని తెలుస్తుంది. భారత్ తోపాటు ఐదు దేశాల్లో డేటా చౌకగా లభిస్తోంది. బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది.

మొబైల్ డేటా చార్జీలు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్  ఐదో ర్యాంకులో ఉంది. 233 దేశాలలో ఒక జీబీ డేటాకు వసూలు చేస్తున్న చార్జీ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ అతి చౌకగా మొబైల్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఒక జీబీకి 0.04 డాలర్ల చార్జీ అక్కడ అమల్లో ఉంది. అంటే రూపాయిల్లో రూ.3.20. ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఒక జీబీ డేటా చార్జీ 0.12 డాలర్లుగా ఉంది. అంటే రూ.9.59. 

శాన్ మారినో మూడో స్థానంలో ఉంది. ఒక జీబీ డేటా ధర 0.14 డాలర్లు. అంటే రూ.11.19. ఆ తర్వాత ఫిజీ ఉంది. అక్కడ ఒక జీబీ డేటా చార్జీ 0.15 డాలర్లు (రూ.11.99). ఇక ఐదో స్థానంలో ఉన్న మన దేశంలో ఒక జీబీ డేటా డేటా 0.17 డాలర్లు (రూ.13.58). 

ప్రపంచంలో మొబైల్ డేటా టారిఫ్ లు భారీగా ఉన్న దేశాలను గమనిస్తే.. సెయింట్ హెలెనాలో 41.06 డాలర్లు (రూ.3,324), ఫాల్క్ లాండ్ ఐలాండ్స్ లో 38.45 డాలర్లు, సావో టోమే అండ్ ప్రిన్సిపేలో 29.49 డాలర్లు, టోకెలాలో 17.88 డాలర్లు, యెమెన్లో 16.58 డాలర్ల చొప్పున టారిఫ్ అమల్లో ఉంది.

More Telugu News