Dulquer Salmaan: ఇలాంటి ఒక ప్రేమకథను ఇంతవరకూ చూసుండరు: హను రాఘవపూడి

  • మరో ప్రేమకథా చిత్రంగా 'సీతా రామం'
  • దర్శకత్వం వహించిన హను రాఘవపూడి
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న రష్మిక
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల  
 Hanu Raghavapudi Interview

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి 'సీతా రామం' సినిమాను రూపొందించాడు. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో హను రాఘవపూడి మాట్లాడుతూ .. "ఈ కథ 1960లో నడుస్తున్నట్టుగా చూపించాము. ఆ కాలానికి తగిన వ్యక్తిగానే దుల్కర్ పాత్రను డిజైన్ చేయడం జరిగింది. అసలు మనిషి అనేవాడు ఇలాగే కదా బ్రతకాల్సింది అనిపించేలా ఉంటుంది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమకథను ఇప్పటి వరకూ మీరు ఏ సినిమాలోను చూసుండరు .. ఏ పుస్తకంలోను చదివుండరు. ఇలా కూడా జరుగుతుందా? అన్నట్టుగా ఆ ప్రేమకథ సాగుతుంది. మీతో పాటు ఆ కథ మీ ఇంటికి వస్తుంది .. రెండు మూడు రోజుల వరకూ ఆ పాత్రలు మీతోనే ఉంటాయి. అంతగా ఈ ప్రేమకథ మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News