TS Police: రియల్ హీరో ఎస్సైకి సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ అభినంద‌న‌... ఫొటోలు ఇవిగో

cyberabad police commissioner stephen ravindra facilitates si rambabu
  • మూసీలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడిన ఎస్సై రాంబాబు
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలంగాణ పోలీసు శాఖ‌
  • రాంబాబు బృందానికి స్టీఫెన్ ర‌వీంద్ర ప్ర‌త్యేక అభినంద‌న‌
మూసీ న‌ది వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడి రియ‌ల్ హీరోగా తెలంగాణ పోలీసు శాఖ చేత ప్ర‌శంస‌లు అందుకున్న మంగ‌ళ్‌హా‌ట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబుకు మ‌రో ప్ర‌శంస ద‌క్కింది. సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస‌రావులు రాంబాబు బృందానికి ప్ర‌త్యేకంగా అభినంద‌నలు తెలిపారు. 

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని లోత‌ట్టు ప్రాంతాలు జల‌మ‌యం కాగా... మూసీకి వ‌ర‌ద పోటెత్తింది. ఎలా ప‌డిపోయాడో గానీ... ఓ వ్య‌క్తి మూసీ వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతూ క‌నిపించాడు. ఈ దృశ్యాన్ని చూసినంత‌నే యూనిఫాంలోనే నీటిలోకి దూకిన రాంబాబు ఆ వ్య‌క్తిని భుజాన వేసుకుని మ‌రీ ఒడ్డుకు చేర్చారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను తెలంగాణ పోలీసు శాఖ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా... వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.
TS Police
Cyberabad
Stephen Ravindra
Rambabu
Mangalhat SI

More Telugu News