తెలంగాణలో అసిస్టెంట్​ ఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

27-07-2022 Wed 21:03 | Telangana
  • 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 
  • ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు
  • టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు  
Notification for Assistant MVI Posts in Telangana
తెలంగాణలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రవాణా శాఖ పరిధిలో మొత్తంగా 113 ఏఎంవీఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్ పీఎస్సీ) బుధవారం ప్రకటించింది. 

ఈ పోస్టులకు ఆగస్టు 5 వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. అభ్యర్థుల అర్హతలు, ఇతర అంశాలు, నోటిఫికేషన్  పూర్తి వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చని తెలిపారు.

  • తెలంగాణలో మొత్తంగా 80 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారని.. అందులో భాగంగానే తాజా నోటిఫికేషన్ జారీ అయిందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
  • తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వేగంగా అడుగులు వేస్తోందని.. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు శాఖతోపాటు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని పేర్కొన్నాయి.