అమరావ‌తికి మ‌ద్ద‌తుగా ఈ నెల 29 నుంచి బీజేపీ పాద‌యాత్ర‌

bjp padayatra for amaravati from 29th of this month
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఇప్ప‌టికే రాజ‌ధాని రైతులు దీక్ష‌లు కొన‌సాగిస్తుండ‌గా... తాజాగా అమ‌రావ‌తి కోసం బీజేపీ సైతం పాద‌యాత్ర చేప‌ట్ట‌నుంది. ఈ నెల 29న తాడేప‌ల్లి మండ‌లం ఉండ‌వ‌ల్లిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఈ యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. రాజ‌ధాని గ్రామాల మీదుగా ఈ యాత్ర 75 కిలో మీట‌ర్ల మేర సాగ‌నుంద‌ని బీజేపీ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
BJP
Somu Veerraju
Kanna Lakshminarayana

More Telugu News