Google Maps: గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా స్ట్రీట్ వ్యూ ఫీచర్

  • ప్రయోగాత్మకంగా తొలుత బెంగళూరులో మొదలు
  • తర్వాత హైదరాబాద్, కోల్ కతాలో ప్రారంభం
  • ఒక ప్రాంతంలో ఏవేవి ఉన్నాయో స్పష్టంగా చూసి తెలుసుకునే సదుపాయం
Google Maps in India finally gets Street View coming to these cities first

గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా పలు ఫీచర్లు వచ్చి  చేరాయి. అందులో ముఖ్యంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ గురించి చెప్పుకోవాలి. దీని వల్ల వ్యక్తులు తమ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ తెరిచి.. ల్యాండ్ మార్క్ ను కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ గుర్తించొచ్చు. ఏ ప్రదేశం లేదా రెస్టారెంట్ అయినా వర్చువల్ గా చూడొచ్చు. జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా కంపెనీల భాగస్వామ్యంతో గూగుల్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. అయితే ముందుగా బెంగళూరు వాసులకు ప్రయోగాత్మకంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే హైదరాబాద్ వాసులకు, ఆ తర్వాత కోల్ కతా, మిగిలిన పట్టణాలకు ఈ సదుపాయం విస్తరించనున్నట్టు గూగుల్ ప్రకటించింది.


స్ట్రీట్ వ్యూ కోసం యూజర్లు గూగుల్ మ్యాప్స్ యాప్ ను తెరవాలి. తమకు కావాల్సిన రోడ్ లేదా ఏరియాను జూమ్ చేయాలి. అక్కడ స్థానికంగా ఉన్న కేఫ్ లు, సాంస్కృతి కేంద్రాలు, ఇతర వాణిజ్య కేంద్రాలు, వీధులు, ఇళ్ల గురించి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఫలానా ప్రాంతం, ఫలానా వీధిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫలానా రహదారిపై వాహనాల వేగం పరిమితులు ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది. మూసివేసిన రోడ్ల వివరాలు, ఇతర అవరోధాలను సైతం గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకునే ఏర్పాటును గూగుల్ కల్పించింది.

More Telugu News