Rakhi Sawant: రాఖీ సావంత్ కు ఫైన్ విధించిన పోలీసులు

Police imposes fine to Rakhi Sawant
  • అంధేరీ వెస్ట్ లో రోడ్డు మధ్యలో చాలా సేపు ఆగిన రాఖీ సావంత్ కారు
  • భారీగా జామ్ అయిన ట్రాఫిక్
  • పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు
బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ కు ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే, అంధేరీ (వెస్ట్)లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో రాఖీ సావంత్ కోసం ఆమె కారు రోడ్డు మధ్యలో చాలా సేపు ఆగింది. కెమెరాలకు పోజులిస్తూ ఆమె రోడ్డుపై ఉండిపోయింది. దీంతో, అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 

ఈ సందర్భంగా ట్రాఫిక్ లో నిలిచిపోయిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'నేను నిలిచిన చోట నుంచే లైన్ స్టార్ట్ అవుతోంది. ఆగండి' అంటూ ఆమె కారులోకి ఎక్కి వెళ్లిపోయింది. రాఖీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విజువల్స్ ను పోలీసులకు షేర్ చేశారు. 

ఈ నేపథ్యంలో, వీడియోను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు ఆమె వాహనానికి ఈ చలాన్ విధించారు. ఓషీవారా ట్రాఫిక్ డివిజన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ దిలీప్ భోస్లే మాట్లాడుతూ, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు చలాన్ విధించామని చెప్పారు.
Rakhi Sawant
Bollywood
Car
Traffic Jam
Chalan

More Telugu News