Koena Mitra: రణవీర్ ఫొటోషూట్ ను తెగ మెచ్చుకున్న కోయినా మిత్రా

Koena Mitra says Ranveer Singh is kinda crazy attractive
  • రణవీర్ ను ఎంతో ఉత్సాహవంతుడన్న మోడల్
  • ఆ ఉత్సాహమే తనకు ఇష్టమని ప్రకటన
  • భారతీయులు కపటంగా, తీర్పు చెప్పేస్తుంటారని విమర్శ
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ ను నటి, మోడల్ కోయినా మిత్రా సమర్థించింది. రణవీర్ సాహసం చేశారని మెచ్చుకుంది. జులై 22న రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడం తెలిసిందే. దీనికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు రాగా.. ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో కోయినా మిత్రా స్పందిస్తూ.. భారతీయులు తీర్పు చెప్పే మనస్తత్వంతో, కపటంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ‘‘రణవీర్ ప్రయోగాలు చేయడం అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడూ ప్రజలతో సరదాగా ఉంటారు. అటువంటి వ్యక్తి నుంచి ఏదైనా ఆశించడం సహజం. రణవీర్ క్రేజీగా ఉంటారు. ఇప్పుడు ఆ క్రేజీయే ఆకర్షిస్తోంది. అతనికి ఎంత వెర్రి ఉందో మనకు తెలుసు. అతడి ఎనర్జీ అంటే నాకిష్టం. స్క్రీన్ పై అయినా, స్టేజీ లేదా ప్రజల మధ్య అయినా, సోషల్ మీడియాలోనూ మిగిలిన వారి కంటే అతడు కొంత భిన్నం’’ అంటూ కోయినా మిత్రా తన అభిప్రాయాలను పంచుకుంది.
Koena Mitra
supports
Ranveer Singh
crazy
attractive

More Telugu News